BREAKING
డిజిటల్ వరల్డ్‌లోకి మెగాస్టార్ ఎంట్రీ: నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ‘మెగావర్స్’ టాక్ షో షురూ ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి

గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ ....

Select Suryaa Now
గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ...  మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ...  బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్  క్లీన్ స్వీప్ ....

హిందూపురం: - గ్రామాలు, మండల అభివృద్ధి చూసి గ్రామ నాయకులను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది, అదే బాటలో గత రెండున్నర సంవత్సరాలు టిడిపి అధికారం చేపట్టినప్పటి నుండి గ్రామాల్లో సి సి రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని మండల కన్వీనర్ అభిలాష్, రాష్ట్ర టూరిజం డైరెక్టర్ జయప్ప, జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్ కుమార్ లు పేర్కొన్నారు . హిందూపురం నియోజకవర్గంతో పాటు లేపాక్షి ఎంతో అభివృద్ధి చెందిందని ప్రతి గ్రామంలోనూ సమస్య ఉందని నాయకుల దృష్టికి తీసుకువచ్చిన కార్యకర్తలకు న్యాయం చేసిన ఘనత ఒక టిడిపికే ఉందని వారు పేర్కొన్నారు, మండల పరిధిలోగల లేపాక్షి,కోడిపల్లి , కంచిసముద్రం  గ్రామంలో నాయకులు సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి , పథకాలు వంటి కార్యక్రమాలు చూసి ఓటు వేయాలన్నారు .

మండల అభివృద్ధి మా లక్ష్యం...

జడ్పిటిసి అభ్యర్థి యం చంద్రకళ ఆనంద్ కుమార్, ఎంపీపీ అభ్యర్థి  ప్రభాకర్ రెడ్డి లు మాట్లాడుతూ మండల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత దృఢంగా ప్రజల గుండెల్లో నిలుస్తామని వారు పేర్కొన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం దిశగా పనిచేస్తామని అన్నారు.

బాలయ్యకు మేము ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్.....

లేపాక్షి మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలు గెలిచి బాలయ్యకు గిఫ్ట్ ఇస్తామని నాయకులు పేర్కొన్నారు. ఆదిశగా కార్యకర్తలు అందరూ పనిచేయాలని వారు సూచించారు, మండల అభివృద్ధి బాలయ్య ద్వారానే సాధ్యమని కావున బాలయ్యకు మనం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . ఈ కార్యక్రమంలో లేపాక్షి గోవిందు, కంచి సముద్రం ఈడిగ చంద్రశేఖర్ కోడిపల్లి నాయకులు సతీష్, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి తదితర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర