BREAKING
నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం!

ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు

Select Suryaa Now
ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు

 

 

• జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :


ఖరీఫ్ 2026–27 సీజన్‌లో ధాన్యం కనీస మద్దతు ధర కొనుగోళ్ల నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా కట్టడి చేసేందుకు జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామం సమీపంలోని లక్ష్మీపూర్ వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర సరిహద్దులోని సిరొంచా ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాల ధాన్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. చెక్‌పోస్టు వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులకు బదిలీల వారీగా విధులు కేటాయించడం జరిగిందని, సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ, చెక్‌పోస్టును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బందిని జైపూర్ ఎ సి పి, జిల్లా వ్యవసాయ అధికారి, కోటపల్లి తహసిల్దార్ సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు. రాజస్వ మండల అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌లు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం వాహనాలను జిల్లాలోకి అనుమతించరాదని, ఆదేశాలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని పి ఎ సి ఎస్ కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని తీసుకురాకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, ఇతర రాష్ట్రాల ధాన్యం గుర్తించిన పక్షంలో స్వాధీనం చేసుకొని, సంబంధిత రైతులకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ, స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.