సోడిగానిపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
ఎంపీటీసీ అభ్యర్థి శాంతమ్మ బాబు నాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి మంజుప్రియ వెంకటేష్‌కు మద్దతుగా ప్రచారం
గుడిపల్లి మేజర్ న్యూస్: సోడిగానిపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా శాంతమ్మ బాబు నాయుడు, గుడిపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా మంజుప్రియ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో గురువారం సోడిగానిపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు టి.ఎం. బాబు నాయుడు, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.
సోడిగానిపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి శాంతమ్మ బాబు నాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పార్టీ శ్రేణులు ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికల్లో ప్రజలందరూ చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రిపోర్టర్ :లెనిన్ బాబు గుడిపల్లి మండలం