BREAKING
వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇంటి దొంగతనాల కేసుల్లో ముగ్గురి పట్టివేత... - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

విద్యార్థులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

Select Suryaa Now
విద్యార్థులు పోక్సో  చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

 

సివిల్ జడ్జ్ నారం అరుణ్ కుమార్

ఆమనగల్లు రంగారెడ్డి:

విద్యార్థులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ చెప్పారు. గురువారం ఆమనగల్లు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు బాలికలకు అందరికీ చట్టం రక్షణగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తితే న్యాయ సేవలను సంప్రదిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోక్సో చట్టంలో పొందుపరిచిన సెక్షన్లు వాటి శిక్షల గురించి విద్యార్థినీ లకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాదిలాల్, కోర్టు సూపరింటెండెంట్ మురళీధర్, ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి, న్యాయవాదులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, నరేందర్, మహేష్, హెచ్ఎం

రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్