BREAKING
ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ACR’S భృంగి జూనియర్ కళాశాలలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన జడ్జి ఆర్. శాంతిలత

Select Suryaa Now
ACR’S భృంగి జూనియర్ కళాశాలలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన జడ్జి ఆర్. శాంతిలత
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: విద్యార్థులందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్. శాంతిలత సూచించారు. వికారాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా ACR’S భృంగి జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జడ్జి ఆర్. శాంతిలత మాట్లాడుతూ… మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. చిన్నారులు, మైనర్లపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్, కళాశాల డైరెక్టర్ కుమారస్వామి, శివప్రసాద్, ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.