BREAKING
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రభుత్వ ఆసుపత్రిలోని వికలత్వ నిర్ధారణ కేంద్రం, క్యాన్సర్ వార్డును జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ గురువారం సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.వికలత్వ నిర్ధారణ కేంద్రంలో దివ్యాంగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, నిర్ధారణ ప్రక్రియ, వారికి అందిస్తున్న సేవల గురించి సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు అవసరమైన సేవలను సకాలంలో అందించాలని సూచించారు.అనంతరం క్యాన్సర్ వార్డును సందర్శించి, చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, వార్డులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శుభోత్, ఈఈ పీఆర్ ఉమేష్, వైద్యులు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.