BREAKING
తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు. గంట వ్యవధిలోనే స్పందన.. మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత 1వ వార్డులో తెదేపా ప్రచార హోరు.. కాకాని పావని కి అడుగడుగునా బ్రహ్మరథం. అమరవీరుల స్ఫూర్తితో.. 350 యూనిట్ల రక్తదానం. - యువతను అభినందించిన డీసీపీ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య - కేసు నమోదు బంపర్ మెజారిటీ దిశగా వైసిపి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి అడుగులు తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడు మృతి చెందిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అప్రమత్తత అవసరం దౌలాపూర్ శివారులో వ్యక్తి మృతి.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే విషాదం దౌలాపూర్ రైతుల పరిహార పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: రవీందర్ రెడ్డి పెద్ద రంగాపురంలో వైసిపి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి 14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. :

రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి

Select Suryaa Now
రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ఘట్కేసర్‌ రైల్వే వంతెన నిర్మాణం సాధించే వరకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని ఘట్‌కేసర్ ‌ శివారెడ్డిగూడలోని బంధన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. పట్టణ భవిష్యత్తు, భావితరాల ప్రయోజనాల దృష్ట్యా వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. ఇందులో భాగంగా నాయకులు పార్టీ కండువాలు ధరించకుండా ముందుకు సాగాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న వంతెన నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులు తమకు సరైన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్‌ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. సమావేశం అనంతరం జాతీయ రహదారిపై నిర్మాణ పనులు చేపడుతున్న సదరు కాంట్రాక్టర్‌ సిబ్బందిని కలిసి, ఎక్కువ మంది కూలీలను నియమించి పనులు వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వంతెన సాధన కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సింగిరెడ్డి రామిరెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, అబ్బసాని యాదగిరి యాదవ్, పలుగుల మాధవరెడ్డి, చింతల యాదయ్య, సబిత, రేసు లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్ గుప్తా, బండారి అంజి, బేతాళ నర్సింగ్, ప్రమోద్ గుప్తా, మహిపాల్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.