BREAKING
ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: చివరి ఎనిమిది నిమిషాల్లో అద్భుతం చేసిన భారత్, హ్యాట్రిక్ విజయం సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’

14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి

Select Suryaa Now
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి

వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక శ్లోకా పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులకు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా స్కాలర్షిప్ లకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి వెల్లడించారు. గురువారం స్కాలర్షిప్ కింద ఎంపికైన విధ్యార్ధులను అభినందిస్తూ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా భ్యాసానికి ప్రోత్సాహిస్తూ శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ కింద తమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం గర్వణీయంగా ఉందన్నారు. ఏడాదికి రూ. 4 వేలు చొప్పున స్కాలర్షిప్ అందుతుందని, వీటిని విధ్యార్థులు చక్కగా ఉపయోగించుకొని చదువులపై శ్రద్ధ చూపి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే తమ పాఠశాల విధ్యార్థులు అన్ని రంగాల్లో రానించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సీనియర్ బిజినెస్ మేనేజర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: గండికోట షేక్ ఖదీర్
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.