BREAKING
ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు

కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి

Select Suryaa Now
కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి


విశాఖ పట్ల కూటమి పార్టీల వైఖరికి తగిన గుణపాఠం చెప్పండి.
: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పిలుపు

శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు

స్థానిక సామాజిక వర్గాలైన కాపు, యాదవ, గవరలకు రాజకీయ అధికారం లేకుండా బాబు కుట్ర
తన బంధుగణం, అనుచరులకే గ్రేటర్ విశాఖపై పెత్తనం
: మాజీ ధర్మాన ప్రసాదరావు మండిపాటు
శ్రీకాకుళం అక్టోబర్ 30 మేజర్ న్యూస్:నిజంగా విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రెండున్నరేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసారా..?జీవీఎంసీ నిధులు రూ. 1738కోట్లను అమరావతికి తరలింపు బాబు కపట ప్రేమకు నిదర్సనం కాదా..?: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు సూటి ప్రశ్నలుఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్ చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఒక్కటీ ముందుకు సాగడం లేదుపోలవరం బ్యారేజీ ఎత్తు తగ్గించారు.. ఫిషింగ్ హార్బర్ పనులు నిలిపివేయడం ద్రోహం కాదా: ధర్మాన ప్రసాదరావు  ఆక్షేపణకూటమిని నిలదీసే ధైర్యం.. సామర్థ్యం వరుదు కల్యాణికే ఉంది
ఆమెను గెలిపించి కూటమికి బుద్ధి చెప్పండి: ధర్మాన ప్రసాదరావు విజ్జప్తిశ్రీకాకుళం:గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో చైతన్యవంతులైన స్థానిక ప్రజలు  తమ నగరం పట్ల కూటమి పార్టీల వైఖరిని, అభివృద్ధి పట్ల  వ్యవహరించిన తీరును సమగ్రంగా పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి,  వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు  ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాశ్రేయస్సును, అభివృద్ధిని విస్మరించి స్వార్థ ప్రయోజనాలతో పాలన సాగిస్తున్న కూటమిలో ఉన్నటువంటి  పార్టీలను ప్రశ్నించడానికి, ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ప్రజలకు ఉన్న ఏకైక బలమైన ఆయుధం ఓటు అని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానికంగా బలంగా ఉన్నటువంటి కాపు, యాదవ, గవర వంటి సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం లేకుండా చేస్తూ తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెత్తనం అప్పగించి అణగదొక్కుతున్న చంద్రబాబుకు  గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కూటమిని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నగరంగా ఉన్నా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా, ఇక్కడి నిధులను తరలించి అమరావతి అభివృద్ధి వినియోగిస్తుండటం చంద్రబాబు నైజానికి నిదర్శనమని ఆక్షేపించారు.  గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కు చెందిన రూ. 1738 కోట్లను అమరావతికి తరలించి అక్కడ పనులకు వినియోగించడం చంద్రబాబుకు విశాఖపై ఉన్న సవతితల్లి ప్రేమను తెలియజేస్తోందన్నారు.  వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖను రాజధానిగా ప్రకటిస్తే అప్పట్లో చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్రలు చేసిన సంగతి ప్రజలకు తెలియనది కాదన్నారు.  ఈ ప్రెస్ మీట్ లో ధర్మాన ప్రసాదరావు ఇంకా ఏం మాట్లాడరంటే..

విశాఖ భూములపైనే ప్రేమ.. అభివృద్ధిపై ఏదీ..?
విశాఖపట్నంలో విలువైన భూములను ప్రజల అవసరాలకు, నగర అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, వాటిని ప్రైవేటు సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయిస్తున్నారు.  అభివృద్ధి, ఐటీ కంపెనీల పేరుతో రూ. 99 పైసలకే అత్యంత విలువైన  భూములను తనకు కావాల్సిన వారికి చంద్రబాబు ధారాదత్తం చేస్తున్నారు.  తర్లువాడ సమీపంలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ సంస్థకు 30 ఎకరాల భూమిని ఎకరాకు ఒక్క రూపాయి చొప్పున కేటాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? రెహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలో విలువైన భూములు కేటాయించడం, మధురవాడలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కు 22 ఎకరాలు కేటాయించడం, బీచ్ రోడ్డులో మరో సంస్థకు 13 ఎకరాలకు పైగా భూమిని 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం వంటి అంశాలపై ప్రజలకు అనుమానాలున్నాయి. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు కూడా భూముల కేటాయింపులు జరిగాయి. ఇంత  విలువైన భూములను అతి తక్కువ ధరలకు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది..? పాల ప్యాకెట్ కూడా 99 పైసలకు దొరకని పరిస్థితుల్లో, కోట్ల రూపాయల విలువైన విశాఖ భూములను ఇంత చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం కలుగుతోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.  విశాఖ భూములు ఇక్కడి ప్రజల ఆస్తులు. వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు స్థానిక ప్రజలకు, నగర అభివృద్ధికే వినియోగించాలి.

ఉత్తరాంధ్ర కీలక ప్రాజెక్టులకు ఉరి

ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలను పెంచే అనేక కీలక ప్రాజెక్టులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. వాటిని కొనసాగించి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. టెక్కలి సమీపంలోని డీప్ వాటర్ సీ పోర్టు ప్రాజెక్టు పనులు  ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. బుడగట్లపాలెం వద్ద సుమారు రూ.400 కోట్లతో చేపట్టాల్సిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కావాలనే నిలిపివేసారు.  అలాగే అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద చేపట్టాల్సిన ఫిషింగ్ హార్బర్ పనులు కూడా ముందుకు సాగడం లేదు.  
ఈ రెండు ఫిషింగ్ హార్బర్లు పూర్తయి ఉంటే విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు మరో 500 బోట్లకు అవకాశం కలిగేది. వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి లభించేది.  మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి  ఉండేది కాదు.   భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన రహదారి, ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి  జగన్ తన ప్రభుత్వంలో  ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి ఆమోదం పొందేలా చేసారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో  విమానాశ్రయానికి చేరుకోవడానికి కూడా గంటన్నర సమయం పడుతున్న పరిస్థితి దాపురించింది. విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామని చంద్రబాబు రోజూ గొప్పలు చెప్పుకుంటున్నారు.  అయితే పోలవరం బ్యారేజీ ఎత్తు తగ్గించే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తరాంధ్రకు నీరు అందించే అంశంపై ప్రభావం చూపే ప్రమాదం  ఉంది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రణస్థలం తదితర ప్రాంతాలకు తాగునీరు, వ్యవసాయ అవసరాలకు నీరు అందించాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వైఎస్సార్ హయాంలో నిర్మించిన కాలువల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపించి, నీరు వచ్చేస్తోందన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక నీటి అవసరాలను తీర్చే సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు

రెండున్నరేళ్ల కాలంలో విశాఖకు ఒక్కటైనా మంచి పని చేసారా..?

విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెందిన సుమారు రూ.1,738 కోట్ల నిధులను అమరావతికి తరలించారు. నగరంలో అనేక మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తుంటే, స్థానిక అవసరాలకు వినియోగించాల్సిన ఆ నిధులను మరో ప్రాంతానికి తరలించడం విశాఖ ప్రజలకు అన్యాయం చేయడం కాదా.. విశాఖలో అనేక మురికివాడలు ఉన్నాయి.  అక్కడ ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వేసవిలో కొన్ని ప్రాంతాల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పారిశుద్ధ్య సమస్యలు, పేరుకుపోతున్న చెత్తకుప్పలు, అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరుదు కల్యాణిని గెలిపించి కూటమికి బుద్ధి చెప్పండి

గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్ బలపరిచిన మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని గెలిపించాలి. ఆమెకు శాసనమండలిలో పనిచేసిన అనుభవం ఉంది.  ప్రజా సమస్యలను ధైర్యంగా, సమర్థవంతంగా ప్రస్తావించగల సామర్థ్యం పుష్కలంగా ఉంది.  శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖపట్నంలో స్థిరపడిన వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు.  ముఖ్యంగా గత 80 సంవత్సరాలుగా విశాఖలో స్థిరపడిన శ్రీకాకుళం ప్రజలందరూ వరదు  కళ్యాణిని గ్రేటర్ విశాఖ మేయర్ ని చేసేందుకు  మద్దతుగా నిలవాలి. నిధుల కేటాయింపులు, నగరపాలక సంస్థ నిధుల తరలింపు, తాగునీటి సమస్య, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు, నిలిచిపోయిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి. 
విశాఖపట్నం కేవలం ఒక నగరం మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గుండెకాయ వంటిదని  ప్రజలంతా గుర్తించాలి. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడుకోవాలన్నా, నగర అభివృద్ధికి నిధులు రావాలంటే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ముందుకు సాగాలంటే ప్రజలు చైతన్యంతో నిర్ణయం తీసుకోవాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు  కళ్యానిని గెలిపించి, విశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఓటుతో ప్రజలు తిరగబడాలని  ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.