BREAKING
జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి

వరద బాధితులకు ఆపన్నహస్తం

Select Suryaa Now
వరద బాధితులకు ఆపన్నహస్తం

 

కాపు గోపాలపురంలో సైలాడ సతీష్ అల్పాహార పంపిణీ

కష్టంలో కన్నీరు తుడవడమే నిజమైన ప్రజాసేవ..

వరద గుండెల్లో భరోసా నింపిన సైలాడ సతీష్

పాతపట్నం అక్టోబర్ 30:మేజర్ న్యూస్:

తీవ్రమైన అర్నబ్ తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమై జలదిగ్బంధంలో చిక్కుకున్న కాపు గోపాలపురం గ్రామ బాధితులను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సైలాడ సతీష్ శుక్రవారం తెల్లవారుజామునే పరామర్శించి పౌష్టికరమైన అల్పాహారం, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. మోకాళ్ళలోతు వరద నీటిని సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటి గడపకూ చేరి స్వయంగా ఆహారాన్ని అందజేసి బాధితులకు కొండంత అండగా నిలిచారు. ఆపత్కాలంలో కడుపు నింపి ప్రాణభయం పోగొట్టిన నాయకులకు బాధితులు కన్నీటితో కృతజ్ఞతలు తెలుపగా, సాధారణ పరిస్థితులు నెలకొనేంతవరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.