BREAKING
ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు

విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా

Select Suryaa Now
విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా

సీతమ్మధార,సూర్య: గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నగరాన్ని ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానని వరుదు కళ్యాణీ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నగరాన్ని  సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందిని ఆమె స్పష్టం చేశారు. విశాఖలో వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్ తో పాటుగా ఇతర నేతలతో కలసి అమె మీడియాతో మాట్లాడుతూ,  తనకు  అవకాశం కల్పిస్తే ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శకతతో, అవినీతికి తావులేని పాలన అందిస్తాని ప్రకటించారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కరించడమే కాకుండా  విశాఖను పర్యావరణహిత, సురక్షిత, ఆరోగ్యకరమైన, ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు.   గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టారని గుర్తు చేసారు.  విశాఖ ప్రజలకు సుమారు రూ.6,000 కోట్ల సంక్షేమాన్ని అందించడంతో పాటు రూ.2,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వరుదు కళ్యాణి వివరించారు. మళ్లీ వైఎస్సార్‌సీపీకి అవకాశం కల్పిస్తే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక విజన్‌తో ముందుకు వెళ్తామని తెలిపారు.  గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల్లో   ప్రజల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు.   ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతోందిని వ్యాఖ్యానించారు.  గత 30 నెలలుగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, . విశాఖపట్నం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ ఆమె ఇంకా ఏం మాట్లాడరంటే..

  • కూటమి మ్యానిఫెస్టోతో ప్రజలకు భంగపాటు

విశాఖ ప్రజలకు కూటమి పార్టీలు  వెలువరించిన ఈ మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలపై స్పష్టమైన ప్రకటనలు ఉంటాయని ఆశించినా, ప్రజలకు భంగపాటు తప్పలేదు.  గీతం విద్యాసంస్థలకు సంబంధించిన భూముల ఆక్రమణ ఆరోపణలపై ఏం చెబుతారోనని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆ విషయాన్ని మ్యానిఫెస్టోలో ప్రస్తావించలేదు.  పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకుంటారో ప్రకటించలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు.  గత ఆరు నెలలుగా నగరాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రస్తావనే లేదు.  99 పైసలు, రూపాయి లీజు పేరుతో విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్న వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేక దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారు.   ఈ 30 నెలల్లో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసి, తానే ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చూపించగలరా? ప్రజలకు ఉపయోగపడే ఒక్క భవనమైనా నిర్మించగలిగారా? అని ప్రశ్నిస్తున్నాం.

  • మా ప్రాధాన్యతా అంశాలు ఇవే..

జీవీఎంసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే  తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా.  అలాగే నగరాన్ని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న  ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేస్తా.  అత్యంత దారుణంగా ఉన్న విశాఖ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటా.  పర్యావరణ పరిరక్షణకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళతా.  
పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తా.  రోడ్డు పక్కన, ఫుట్ పాత్ పైన ఉండే చిరు వ్యాపారులకు అండగా నిలుస్తాం.  చిన్న చిన్న పనుల కోసం ప్రజలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ ప్రదరక్షణలు చేయకుండా  ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేలా చర్యలు చేపడతా.  నగరంతో పాటుగా విలీనమైన శివారు ప్రాంతాలకు కూడా  మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తా.   విశాఖ వారసత్వం, సంస్కృతికి పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను.

  • స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరపాలి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తే సహించం
  • రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు

గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు  సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కూటమి ప్రభ్వుత్వ అమ్మకాలకు, రాష్ట్రంలో అత్యంత కీలకమైన నగరమై విశాఖ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించి విశాఖలో కూటమి సాగిస్తున్న అరాచకాలకు గుణపాఠం చెప్పాలి.  ఈ జీవీఎంసీ ఎన్నికలు కేవలం మేయర్, కార్పొరేటర్లను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. విశాఖ భవిష్యత్తును ఎవరి చేతుల్లో పెట్టాలనే నిర్ణయం తీసుకునే ఎలక్షన్ .  జరగబోయే జీవీఎంసీ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించడం, బైండోవర్ కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలి. ప్రజలు ఎలాంటి భయాలు, ఒత్తిళ్లు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలి. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

  • తాకట్టు పెట్టడానికి, అమ్మేయడానికి తేడా తెలియదా?

మేము 'సేవ్ విశాఖ' కార్యక్రమం చేపడితే టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. జీవీఎంసీ గతంలో కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టిందని ఎంపీ భరత్  విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.  తాకట్టు పెట్టిన ఆస్తిని అప్పు చెల్లించి తిరిగి విడిపించుకోవచ్చు. కానీ ఒకసారి అమ్మేసిన ఆస్తిని తిరిగి తీసుకురాగలరా? తాకట్టు పెట్టడానికీ, శాశ్వతంగా అమ్మేయడానికీ మధ్య ఉన్న తేడా కూడా తెలియకుండా మాట్లాడటం ఏమిటి?  ఒకవేళ గతంలో జీవీఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టిన విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు అతి తక్కువ ధరలకు కట్టబెడుతున్న విషయంపై సమాధానం చెప్పాలి.

  • ఐటీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • మంత్రి నారా లోకేశ్ కు గుడివాడ అమర్ సవాల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రారంభం నుంచే ఒక స్పష్టమైన నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. అదే 'సేవ్ వైజాగ్'. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం మా లక్ష్యం. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న తీరును చూస్తుంటే విశాఖను అమ్మకానికి పెట్టారా అనే ప్రశ్న తలెత్తుతోంది.  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. రుషికొండపై పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, టీటీడీ ఆలయం, ఐటీ సంస్థల ఏర్పాటు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన రెండేళ్ల రెండు నెలల కాలంలో విశాఖకు అనేక ప్రముఖ ఐటీ సంస్థలను తీసుకువచ్చాను.  ఇన్ఫోసిస్ సంస్థను విశాఖకు తీసుకువచ్చాం. ప్రస్తుతం అక్కడ సుమారు 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిరిపురంలో డబ్ల్యూఎన్ఎస్ సంస్థను తీసుకువచ్చాం. అక్కడ సుమారు 5,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థల్లో ఒకటైన రాండ్‌స్టాడ్‌ను కూడా విశాఖకు తీసుకువచ్చి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. ఏసీఎన్ ఇన్ఫోటెక్ వంటి ఇతర సంస్థలను కూడా తీసుకువచ్చాం. అనేక సంస్థల ద్వారా వేలాది మంది యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేశాం.  ఈ సందర్భంగా ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో విశాఖకు ఎన్ని ఐటీ కంపెనీలను తీసుకువచ్చారు? ఎంతమంది స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించారు? ఎన్ని కొత్త ఐటీ ఉద్యోగాలు వచ్చాయి?  ఈ వివరాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలి. వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అని మాజీ మంత్రి గుడివాడ అమర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు కదిరి బాబు రావు , చింతలపూడి వెంకట రామయ్య , రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, రాష్ర్ట ప్రచార విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు జివి రవి రాజు తదితరులు పాల్గొన్నారు .