పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు .
- 48 గం. ల ముందే ప్రచారాలు ఊరేగింపులు ర్యాలీలు నిషేధం.
- ఎన్నికల నిబంధనలు పాటించి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
* ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధత.
- జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి
శ్రీకాకుళం అక్టోబర్ 30 మేజర్ న్యూస్: జిల్లాలోని పలాస–కాశీబుగ్గ, ఇచ్చాపురం పురపాలక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది అని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ద్వారా తెలిపారు.సుమారు 1100 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు,5 డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తం 1100 మంది విధుల్లో పాల్గొంటున్నారు.పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్లు, బాడీ వార్న్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్‌టీ బృందాలు, రిజర్వ్ పార్టీలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు.ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు: ఎన్నికల నిబంధన మేరకు పోలింగ్ సమయం ముగిసే 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండదు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ఎన్నికల ప్రచారాలు, ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జిల్లాలో ఉండరాదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:పోలీసు యాక్ట్ 30, అమలులో ఉన్న సెక్షన్ 144 నిబంధనల ప్రకారం అనవసరంగా ప్రజలు గుంపులుగా గుమిగూడరాదు.పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండరాదు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు.జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. నగదు, మద్యం, ఇతర ప్రలోభాల వస్తువుల అక్రమ రవాణా, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుంది.పోలింగ్ అనంతరం కూడా పటిష్ట భద్రత:పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులు/ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో ప్రత్యేక భద్రత కల్పిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తారు. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపడతారు.గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగి, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఓటర్లను బెదిరించినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు:ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సమస్యలు, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గుర్తించినట్లయితే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్,
6309990933 జిల్లా పోలీసు ఎన్నికల సెల్: 6309990923.కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం: 6309990805,టెక్కలి డీఎస్పీ కార్యాలయం: 6309990811,శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం: 6309990804,
ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ 6309990827,కాశీబుగ్గ ఎస్ హెచ్ ఓ ,6309990825.కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.