BREAKING
ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు

వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు!

Select Suryaa Now
వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు!


- మోకాల్లోతు వరద నీటిలో పర్యటించిన ఎమ్మెల్యే గొండు శంకర్  
- కండ్రపేట, తాంసాహెబ్ పేట గ్రామాల్లో విస్తృత పర్యటన

గార అక్టోబర్ 30 మేజర్ న్యూస్:
వంశధార నది ఉగ్రరూపం దాల్చి, సాధారణ స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని గార మండలోని ముంపు బారిన పడిన తాంసాహెబ్ పేట, కండ్రపేట గ్రామాల్లో ఈరోజు శాసనసభ్యులు గొండు శంకర్ గారు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. వరద పరిస్థితులను స్వయంగా సమీక్షించిన ఆయన, మోకాల్లోతు వరద నీటిలోనే కాలినడకన వెళ్లి గ్రామస్తుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకుని ఇళ్లకే పరిమితమైన నిస్సహాయ కుటుంబాల వద్దకు వెళ్లి వారికి స్వయంగా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ విపత్కర సమయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిందని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రక్షణ చర్యలు ముమ్మరం చేశామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో అధికారులు అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన భోజనం అందించడంతో పాటు చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం పంపిణీ చేయాలని సూచించారు.
వరద ప్రభావం తీవ్రంగా ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గొండు శంకర్ విజ్ఞప్తి చేశారు. వరద నీరు నిలిచి ఉన్నందున అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, తక్షణమే గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. సరిపడా మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీటిని శుద్ధి చేసే క్లోరినేషన్ మాత్రలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీసు యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తూ, వరద తగ్గుముఖం పట్టే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట ఈ క్షేత్రస్థాయి పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ అధికారులు, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.