సమస్యల పరిష్కారానికి నన్ను గెలిపించండి
సమస్యల పరిష్కారానికై నన్ను గెలిపించండి
ఏలూరు 23వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి గరికిముక్కు గౌతమ్ కుమార్
ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు 23వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి గరికిముక్కు గౌతమ్ కుమార్ శుక్రవారం స్థానిక వంగాయగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ డివిజన్లో అనేక సమస్యలు తిష్ట వేశాయని తెలిపారు. వాటిలో ముఖ్యమైన సమస్య పారిశుధ్య లోపమని పేర్కొన్నారు. తాను ఇదే వంగాయగూడెం డివిజన్ లో పుట్టి, పెరగడం వల్ల ఇక్కడి సమస్యలన్నీ అవగాహన ఉన్నాయని తెలిపారు. ప్రజలు కొబ్బరికాయ గుర్తుపై తమ అమూల్యమైన, అతి విలువైన ఓటును వేసి తనకు అఖండమైన విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.