BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

Select Suryaa Now
మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ :  మియాపూర్ లోని  550 ఎకరాలు ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీం కోర్టు తీర్పుతో భూముల స్వాధీన ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. శుక్రవారం  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి భూముల స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించారు. మియాపూర్ లోని550 ఎకరాల భూమి  హెఎండీఏ ఆధీనంలో ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. ఈ భూములకు ఇప్పటికే ఫెన్సింగ్ వేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 550లో 400 ఎకరాల వేకెంట్ ల్యాండ్ ఉందన్నారు. ప్రస్తుతం వేకెంట్ ల్యాండ్ స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు. సెటిల్మెంట్ రికార్డుల్లో సర్కార్ పోరంబోకు భూమి అని తేలిందని.. పహాణీలో కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలిపారు. విలువైన భూములను కాపాడుకున్నామని అన్నారు. ఈ ల్యాండ్ విలువ 50 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు.  సీఎం సూచనలతో విలువైన భూములు కాపాడామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అన్ని రికార్డులు సమర్పించడం వల్లే ప్రభుత్వ పరమైందని వెల్లడించారు.550 ఎకరాలకుగాను 400ఎకరాల భూమికి మాత్రమే ఫెన్సింగ్ ఉందన్న కలెక్టర్‌ మిగిలిన భూమికి కూడా కంచె వేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ దాదాపు 50 వేల కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఇచ్చే తదుపరి ఆదేశాలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 550ఎకరాలను గుర్తిస్తామని అయితే వంద ఎకరాల వరకు భూమిలో నిరుపేదలు ఉంటున్నారని ఇప్పటికైతే వారి జోలికి వెళ్లమని కలెక్టర్‌ స్పష్టం చేశారు.