మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ నాయకులు
లక్ష్మీదేవి చేరికతో వైసీపీకి మరింత బలం చేకూరింది
శ్రీకాకుళం అక్టోబర్ 30 మేజర్ న్యూస్ : మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని శుక్రవారం పలువురు వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం.ఎల్.బి. శాస్త్రి, ఉమామహేశ్వరరావు, రమణమూర్తి, రామారావు, రాంబాబు, కృష్ణమూర్తి, భాస్కరరావు, మోహన్ తదితరులు ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరడం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని అన్నారు. ఆమె రాకతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అనుకూల వాతావరణం ఉందని, నియోజకవర్గంలో 90 శాతం వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను పార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి చేరికతో పార్టీ బలం మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు.