వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ
Lవెంకటాపురం నూగూరు, మేజర్ న్యూస్, వార్షిక తనిఖీల్లో భాగంగా వెంకటాపురం పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ శుక్రవారం తనిఖీ చేశారు.స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్, సీసీటీఎన్ఎస్ నమోదు వివరాలు, ఈ-సాక్ష్య అమలు పురోగతిని సమీక్షించారు. కేసుల రికార్డులను నిబంధనల ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని, పెండింగ్ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.బెల్ ఆఫ్ ఆర్మ్స్, కార్యాలయ గదులను పరిశీలించి పరిశుభ్రత పాటించాలన్నారు. రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ, విధుల్లో బాధ్యత, ప్రజలకు సేవల్లో నిబద్ధత పాటించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పారదర్శకత, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.కార్యక్రమంలో ఏఎస్పీ ఏటూరునాగారం మనన్ భట్ ఐపీఎస్, సీఐ వెంకటాపురం ముత్యం రమేష్, సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, ఎస్సైలు కొప్పుల తిరుపతి రావు, జక్కుల సతీష్,రేఖ అశోక్, తిరుపతిరెడ్డి, డీసీఆర్బీ ఏఎస్సై శంకరయ్య, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్; చక్రిధర్, వెంకటాపూర్, ములుగు జిల్లా