BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన

Select Suryaa Now
 రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం  శంకుస్థాపన

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ :  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.4.63 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ శుక్రవారం  తాజా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి గురువారం ఆయా ప్రాంతాల్లో పనులకు శ్రీకారం చుట్టారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా  దూబే కాలనీ, డొయన్స్ కాలనీ, అలిండ్ ఎంప్లాయిస్ హౌసింగ్ కాలనీ, అలిండ్ కాలనీ, మసీదు బండ, ప్రభుపాద లేఅవుట్, శిల్పా వ్యాలీ, సెంట్రల్ పార్క్ ఫేజ్-1, స్ప్రింగ్ వ్యాలీ, టీజీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కాలనీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.అదేవిధంగా  రూ.1.20 కోట్లతో గచ్చిబౌలి డివిజన్‌లో అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి గుల్మోహర్ పార్క్, నేతాజీ నగర్, డాక్టర్స్ కాలనీల్లో పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో రహదారుల సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్మశాన వాటికల్లో ప్రహరీ గోడలు, స్నానపు గదులు, విశ్రాంతి గదులు నిర్మించి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వృద్ధులు, పిల్లలు, వాకింగ్ చేసేవారికి అనువుగా పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.