పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అప్పగింత
• సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్‌ను గుర్తించిన సీసీసీ నస్పూర్ పోలీసులు
సూర్య, నస్పూర్:
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించిన సీసీసీ నస్పూర్ పోలీసులు గురువారం బాధితుడికి తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నస్పూర్‌లోని న్యూ నాగార్జున కాలనీకి చెందిన అంచే కృష్ణ చందర్ గత నెలలో సీసీసీ నస్పూర్ మార్కెట్‌లో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోన్ వివరాలను సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌లో నమోదు చేశారు. ఎస్సై ఎం.డి. తహసీనుద్దీన్ ఆధ్వర్యంలో సీసీటీఎన్‌ఎస్ కానిస్టేబుల్ బ్రహ్మచారి సాంకేతిక సహాయంతో మొబైల్ ఫోన్‌ను గుర్తించే చర్యలు చేపట్టారు. మరో సిమ్ కార్డును ఉపయోగిస్తున్న వ్యక్తి వివరాలను ట్రేస్ చేసి, ఆ ఫోన్ మందమర్రిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి తిరిగి అందజేశారు. గురువారం అంచే కృష్ణ చందర్‌కు మొబైల్ ఫోన్‌ను అప్పగించగా, ఫోన్‌ను తిరిగి పొందడంలో సహకరించిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి తిరిగి అందించిన పోలీసుల చర్యను స్థానికులు అభినందించారు.