BREAKING
కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్ 2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు విశ్వక్ సేన్ కల్ట్ సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్, వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న మాస్ కా దాస్ తుఫాను ప్రభావం వలన పాఠశాలలు పరిశీలన

సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక

Select Suryaa Now
సర్కార్ భూమి జోలికొస్తే అంతే  అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్  హెచ్చరిక

అమీన్‌పూర్‌ ; ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ హెచ్చరించారు. భూముల ఆక్రమణలు, లేఅవుట్లకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గురువారం అమీన్‌పూర్‌ రెవెన్యూ పరిధిలో పర్యటించిన కలెక్టర్‌.. బాధితుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి, భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సర్వే నంబర్‌ 1064లో పరిశీలన
అమీన్‌పూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 1064లో గతంలో నారాయణరావు ఏర్పాటు చేసిన లేఅవుట్‌కు సంబంధించి బాధితులు చేసిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సంయుక్త కలెక్టర్‌ సంగీతతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లేఅవుట్‌ వ్యవహారానికి సంబంధించి బాధితులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాలను సేకరించి, ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. భూమికి సంబంధించిన అంశాలపై వాస్తవాలను నిర్ధారించేందుకు అవసరమైన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.
జీఓ 59 దరఖాస్తుల పరిశీలన
అనంతరం సుల్తాన్‌పూర్‌ రెవెన్యూ పరిధిలోని గండిగూడెం శివారులో ఉన్న సర్వే నంబర్‌ 330 ను కలెక్టర్‌ పరిశీలించారు. జీఓ 59 కింద దరఖాస్తు చేసుకున్న నిర్మాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా నిర్మాణాలకు సంబంధించిన వివరాలు, దరఖాస్తుల స్థితిగతులపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశీలన చేపట్టాలని సూచించారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం
ప్రభుత్వ భూములను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించినట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూములకు సంబంధించిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో అమీన్‌పూర్‌ తహశీల్దార్‌ వెంకటేశ్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.