BREAKING
మరింత లాభాలు వస్తే అదనపు డివిడెండ్.. టోటల్‌ఎనర్జీస్ సీఈఓ కీలక ప్రకటన! 30 నుంచి అంతర్జాతీయ మూట్ కోర్టు పోటీలు తూప్రాన్ లో జూనియర్ సివిల్ కోర్టు నవంబర్ 7న ప్రారంభం భూముల రీ సర్వేకు సహకరించాలి ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నల్ల బెల్లం పట్టివేత రేకులకుంటలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి

కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి

 పట్టణాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి 35, 36 వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రత్తిపాటి వెంకట కుమారి

చిలకలూరిపేట : మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అందించే మెజారిటీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావాలని ప్రత్తిపాటి వెంకట కుమారి ఆకాంక్షించారు.చిలకలూరిపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి,పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గురువారం సాయంత్రం ఆమె 35, 36 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి తోట రాజారమేష్,కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి,ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

రాజరాజేశ్వరి విజయానికి మహిళలు కృషి చేయాలి : చిలకలూరిపేట మున్సిపాలిటీ చరిత్రలో తోట రాజరాజేశ్వరి అతి పిన్న వయస్కురాలైన చైర్‌పర్సన్‌గా నిలిచే అవకాశం ఉందని వెంకట కుమారి పేర్కొన్నారు.ఆమె విజయానికి పట్టణ మహిళలు చురుకుగా కృషి చేసి,భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.మహిళా సాధికారత,భద్రత,ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.మహిళలు,కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, తల్లికి వందనం,దీపం వంటి పథకాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.తోట రాజరాజేశ్వరి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పటికీ,ఆమెను కూటమి అభ్యర్థిగా భావించి ఆదరించాలని వెంకట కుమారి కోరారు.టీడీపీకి బలమైన మద్దతు ఉన్న 35,36 వార్డుల ప్రజలు ఈసారి కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజారిటీ అందించి తమ మద్దతును చాటాలని విజ్ఞప్తి చేశారు.పట్టణ అభివృద్ధి,ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని ఆమె కోరారు.