అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేట సూర్య న్యూస్:
అక్రమంగా మద్యం విక్రయిస్తూ అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తెలిపారు.
యడవల్లి గ్రామానికి చెందిన అవ్వారు అంకమ్మరావు (38), షేక్ చెత్త బుడే (28) ఎటువంటి అనుమతులు లేకుండా మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ గ్రామంలో అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జి. అనిల్ కుమార్ మాట్లాడుతూ, మండల పరిధిలో అక్రమంగా మద్యం విక్రయించినా, అనుమతులు లేకుండా రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట సూర్య రిపోర్టర్ ఆర్సి ఇంచార్జ్