BREAKING
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పశ్చిమ గోదావరిలో ఏరియల్ సర్వే, నష్ట తీవ్రత పరిశీలన! నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం

జాహ్నవిని గెలిపిస్తే పామూరుకు మరింత అభివృద్ధి

Select Suryaa Now
జాహ్నవిని గెలిపిస్తే పామూరుకు మరింత అభివృద్ధి

- ఆరు మండలాల ఎంపీటీసీల ఏకగ్రీవంలో ఎమ్మెల్యే ఉగ్ర కృషి అభినందనీయం

- పామూరు వరకు రైలుమార్గం తీసుకొచ్చేందుకు కృషి

- రూ.1,250 కోట్లతో ఇంటింటికీ మంచినీరు

వెలిగొండ రెండో దశతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు

- మీడియా సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 

పామూరు, మేజర్ న్యూస్ : నవంబర్ 5న జరుగు జడ్పిటిసి ఎన్నికల్లో బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపిస్తే పామూరు మండలానికి మరింత మెరుగైన సేవలు అందించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిపి గురువారం సాయంత్రం పట్టణంలోని పువ్వాడి రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జెడ్పిటిసి అభ్యర్థిని గెలిపించాలని జరిగిన సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబం తొమ్మిది పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసిందని ఈ తొమ్మిది పర్యాయాల్లోనూ కనిగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ అందించారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు 16వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఆరు మండలాల ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఉగ్రను అభినందించడం గొప్ప విషయమన్నారు. ఉగ్ర తన కుటుంబ సభ్యుడని ఆయన ఆలోచన అంతా అభివృద్ధిపైనే ఉంటుందని పేర్కొన్నారు. 11 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే జడ్పీటీసీ చైర్మన్ పదవి కూటమికే దక్కుతుందని తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో నడికుడి రైలుమార్గం పూర్తికావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైలు రాక ప్రారంభమవుతుందని చెప్పారు. రైలుమార్గాన్ని పామూరు వరకు తీసుకొచ్చేందుకు కూడా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూ.1,250 కోట్లతో ఇంటింటికీ మంచినీటిని అందించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నాడు ఉగ్ర నరసింహారెడ్డి 1.0 ద్వారా మంచినీటిని తీసుకువస్తే నేడు ఉగ్ర 2.0గా ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటిని అందించే దిశగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతి గ్రామానికి వి.బి.గ్రామ్‌జీ కింద రూ.30 కోట్ల చొప్పున నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో వెలిగొండ ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేసి కనిగిరి ప్రాంతంలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని 2028లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పడటం వల్ల జిల్లాకు వచ్చే నిధులు నాలుగు నియోజకవర్గాలకే అందుబాటులోకి వచ్చి మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఆ అభివృద్ధి కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ జెడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, సిఎస్ పురం ఎంపీపీ వెంగయ్య, టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు,కొండిశెట్టి రమణయ్య, యారవ శ్రీనివాసులు, దారపనేని చంద్రశేఖర్, బైైరెడ్డి జయరామి రెడ్డి, బైరెడ్డి జాహ్నవి,   ఉప్పలపాటి హరిబాబు, సందాని, ఏలూరి మాధవరావు, సయ్యద్ అమీర్ బాబు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.