భూముల రీ సర్వేకు సహకరించాలి
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో సర్పంచ్ మెరుగు క్రాంతికుమార్ అధ్యక్షతన భూముల రీసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో
నాయబ్ తహసీల్దార్ ఆవుల సంధ్యారాణి మాట్లాడుతూ భూముల రీసర్వేలో భాగంగా రాఘవాపూర్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఈ సర్వేలో గ్రామ హద్దులు,రైతుల భూమి హద్దులు అలాగే చెరువులు, కుంటలు,ప్రభుత్వ కార్యాలయాలు సర్వే చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. సర్వే సమయంలో గ్రామంలోని రైతులు తమ భూముల వద్ద ఉండి సర్వేకు సహకరించాలని డిటి కోరారు.
ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రపు నర్సింహులు, ఆర్ఐ కొలిపాక శ్రీకాంత్,మండల సర్వేయర్ రోజా,జీపీవోలు.ఇ. గౌతమి, ఉపేంద్ర వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;మోహన్, స్టేషన్గన్పూర్, జనగామ జిల్లా