నల్ల బెల్లం పట్టివేత
మరిపెడ, మేజర్ న్యూస్, మండలంలోని గిరిపురం ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా నల్లబెల్లం పట్టుబడింది.బుధవారం సాయంత్రం అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, వాహనదారులు ఆగకుండా తప్పించుకునేందుకు యత్నించడంతో అప్రమత్తమైన మరిపెడ పోలీసులు వాహనాన్ని వెంబడించి అడ్డుకుని తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో వాహనంలో ఉన్న 30 బస్తాల నల్లబెల్లం, 2 బస్తాల పట్టికను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఇద్దరిని విచారించగా, వారు చొక్ల తండాకు చెందిన బానోత్ కిషన్, బానోత్ నవీన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి తక్కువ ధరకు నల్లబెల్లం, పట్టికను కొనుగోలు చేసి చుట్టుపక్కల తండాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వారు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన నల్లబెల్లం, పట్టిక విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు.
రిపోర్టర్ ; చందర్, మరిపెడ ,మహబూబాద్ జిల్లా