BREAKING
గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘డెస్టినీ’ మూవీ నుంచి ‘ఇద్దరి గుండెలపైన’ సాంగ్ రిలీజ్! మరింత లాభాలు వస్తే అదనపు డివిడెండ్.. టోటల్‌ఎనర్జీస్ సీఈఓ కీలక ప్రకటన! 30 నుంచి అంతర్జాతీయ మూట్ కోర్టు పోటీలు తూప్రాన్ లో జూనియర్ సివిల్ కోర్టు నవంబర్ 7న ప్రారంభం భూముల రీ సర్వేకు సహకరించాలి ప్రైవేటు పాఠశాలల్లో పీఈటీ ఉపాధ్యాయుల కొరత.. క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం

బంపర్ మెజారిటీ దిశగా వైసిపి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి అడుగులు

Select Suryaa Now
బంపర్ మెజారిటీ దిశగా వైసిపి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి అడుగులు
కదిరి మున్సిపాలిటీలోని 7 వార్డ్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రత్యర్థులు సైతం అదరహో అనేలా కొనసాగి స్తున్నారు. గురువారం రాత్రి వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారంను చేపట్టగా.. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా , వైయస్సా ర్సీపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం ద్వారా కృపాకర్ రెడ్డి కి ప్రజల నుండి లభిస్తున్న ఆదరణను చూసి బంపర్ మెజార్టీ దిశగా అడుగులు పడుతు న్నాయంటూ పలువురు పేర్కొ న్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా మాట్లాడుతూ  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పాలన ను ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లు తెలిపారు. అందుకే వైయస్సార్ సిపి చైర్మన్ కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచార కార్యక్రమానికి వెళ్తుంటే ప్రజల నుంచి స్పందన లభిస్తోందని కొనియాడారు.  పట్టణ ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి పట్టం కడతారని.. అందుకు వారి చూపుతున్న అభిమానమే అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యారంగంలో నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పేద విద్యార్థులకు కార్పొ రేట్ విద్యను అందించారని, ఆరోగ్య రంగంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా పేదవాడికి కూడా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించారని తెలిపారు. మహిళల కోసం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలను ఆర్థికంగా బలోపేతం చేశారని, రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి రైతు కష్టాలను తీర్చారని వివరించారు. కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 1న జరిగే పోలింగ్ కార్యక్రమం నందు తనను కౌన్సిలర్ గాను, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తన ప్రచారానికి వార్డు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిం చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.