BREAKING
మరింత లాభాలు వస్తే అదనపు డివిడెండ్.. టోటల్‌ఎనర్జీస్ సీఈఓ కీలక ప్రకటన! 30 నుంచి అంతర్జాతీయ మూట్ కోర్టు పోటీలు తూప్రాన్ లో జూనియర్ సివిల్ కోర్టు నవంబర్ 7న ప్రారంభం భూముల రీ సర్వేకు సహకరించాలి ప్రైవేటు పాఠశాలల్లో పీఈటీ ఉపాధ్యాయుల కొరత.. క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నల్ల బెల్లం పట్టివేత రేకులకుంటలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రచారం

అమరవీరుల స్ఫూర్తితో.. 350 యూనిట్ల రక్తదానం. - యువతను అభినందించిన డీసీపీ

Select Suryaa Now
అమరవీరుల స్ఫూర్తితో.. 350 యూనిట్ల రక్తదానం. - యువతను అభినందించిన డీసీపీ

 

సూర్య - పెద్దపల్లి: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని 350 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన యువతను అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రమేష్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు జి. రాజశేఖర్, మధుకర్, శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.