BREAKING
ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నల్ల బెల్లం పట్టివేత రేకులకుంటలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 21, 23వ డివిజన్లలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం.. ప్రచారంలో పాల్గొన్న టీసీ వరుణ్ అమ్మ నీరజ, మేయర్ అభ్యర్థి అజేష్ బాబు రేపటి నుంచే థియేటర్లలో 'ఆదర్శ కుటుంబం' సందడి.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందన్న త్రివిక్రమ్! జాహ్నవిని గెలిపిస్తే పామూరుకు మరింత అభివృద్ధి అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్

పెద్ద రంగాపురంలో వైసిపి ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
పెద్ద రంగాపురంలో వైసిపి ఇంటింటి ప్రచారం

పులివెందుల మేజర్ న్యూస్:


పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు పెద్దరంగాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గురువారం పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు.
నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఓటర్లంతా తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ ప్రమీలమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పులివెందుల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రామ్ లక్ష్మణ్ రెడ్డి, 1వ వార్డు బీసీ అధ్యక్షుడు రాజేష్ కన్నా, బీసీ ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, పుల్లయ్యతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పి కృష్ణ. పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా