BREAKING
కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి

పువ్వాడి దంపతులకు ఘన సన్మానం

Select Suryaa Now
పువ్వాడి దంపతులకు ఘన సన్మానం

- మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అభినందనలు

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని చిలంకూరు ఎంపీటీసీగా పువ్వాడి వెంకటేశ్వర్లు, తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీగా ఆయన సతీమణి పువ్వాడి వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గురువారం వారిని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్‌తో పాటు తూర్పు కోడిగుడ్లపాడు టీడీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. దారపనేని రాజేంద్రప్రసాద్, దారపనేని చిన్న చిన్నయ్య, తిరివీధి కేశవరావు, మానం మల్లికార్జునరావు తదితరులు పువ్వాడి దంపతులకు పూలమాలలు వేసి, దుశ్శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ స్వగ్రామమైన తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీగా తమ కుటుంబ సభ్యురాలు పువ్వాడి వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా పువ్వాడి వెంకటేశ్వర్లు ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మిరియం సుబ్బరాయుడు, తిరివీధి చంద్ర, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ దేవరకొండ చెన్నకేశవులు, మక్కా నాగరాజు, మానం కిరణ్, మానం వెంగళరావు, చెనికల మాలకొండయ్య, చెనికల రామయ్య, చెనికల శ్రీనివాసులు, మానం నాగేంద్ర, మానం వెంకట బాజీ, మానం కొండలరావు తదితరులు పాల్గొన్నారు.