తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు.
కడెం మండలం కొత్త మద్దిపడగ సదర్‌మాట్ బ్యారేజీ చివరి ఆయకట్టు గ్రామాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఆయకట్టు రైతుల సమస్యలపై స్పందించి సాగునీరు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.