andhrapradesh
1వ వార్డులో తెదేపా ప్రచార హోరు.. కాకాని పావని కి అడుగడుగునా బ్రహ్మరథం.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థి కాకాని అశోక్ గారి సతీమణి కాకాని పావని, వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి దామా సురేంద్ర తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వార్డు ప్రజలు, మహిళలు ఇళ్లకు వచ్చిన నేతలకు అడుగడుగునా మంగళ హారతులు పడుతూ, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.