telangana
దౌలాపూర్ రైతుల పరిహార పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: రవీందర్ రెడ్డి
యాలాల, మేజర్ న్యూస్ : దౌలాపూర్ రెవెన్యూ గ్రామానికి చెందిన బాధిత రైతులకు న్యాయమైన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాలాల మండల కేంద్రంలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ యాలాల మండల అధ్యక్షుడు సి. రవీందర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులు నాలుగు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధిత రైతులందరికీ న్యాయమైన పరిహారం అందే వరకు బీఆర్‌ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతులతో చర్చలు జరిపి పరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వారితో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకుడు మహేందర్, బీఆర్‌ఎస్ నాయకులు లాలప్ప, చిట్టి పటేల్, పటేల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, యువ నాయకులు మహేశ్వర్ రెడ్డి, శ్రీశైలం తదితరులతో పాటు బాధిత రైతులు వెంకటయ్య, అంజిలమ్మ, బాల్‌రాజ్, చంద్రమ్మ పాల్గొన్నారు.