తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడు మృతి చెందిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
తూప్రాన్;తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువులో నీటిలో మునిగి సుబ్రహ్మణ్యం (అలియాస్ మున్నా) మృతి చెందిన ఘటనకు సంబంధించి, మృతుడి తల్లి కళ్లెం శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.దర్యాప్తులో భాగంగా, మృతుడు సుబ్రహ్మణ్యంతో ప్రవీణ్ మరియు చైతన్య అనే ఇద్దరు వ్యక్తులు గొడవ పడినట్లు, గొడవ అనంతరం వారి మధ్య జరిగిన సంఘర్షణలో నిందితులు మాట్లాడిన మాటల కారణంగా సుబ్రహ్మణ్యం చెరువులో మునిగి మృతి చెందినట్లు మృతుడి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తులో సేకరించిన వివరాల ఆధారంగా ప్రవీణ్ మరియు చైతన్యలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు,