BREAKING
ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన తెదేపా శ్రేణులు. తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు. గంట వ్యవధిలోనే స్పందన.. మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత 1వ వార్డులో తెదేపా ప్రచార హోరు.. కాకాని పావని కి అడుగడుగునా బ్రహ్మరథం. అమరవీరుల స్ఫూర్తితో.. 350 యూనిట్ల రక్తదానం. - యువతను అభినందించిన డీసీపీ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య - కేసు నమోదు బంపర్ మెజారిటీ దిశగా వైసిపి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి అడుగులు తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడు మృతి చెందిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అప్రమత్తత అవసరం దౌలాపూర్ శివారులో వ్యక్తి మృతి.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే విషాదం దౌలాపూర్ రైతుల పరిహార పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: రవీందర్ రెడ్డి పెద్ద రంగాపురంలో వైసిపి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి 14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత

మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం

Select Suryaa Now
మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం

 

ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి మున్సిపాలిటి పరిధిలో విస్తృత ప్రచారం..!

మాచర్ల :

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి, ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకొని తల్లడిల్లుతున్న మాచర్ల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దే తమ అభిమతం, ఎజెండా అని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం  మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటనతో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 30 వార్డు నందు కూటమి పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్పర్సన్ అభ్యర్థి యెనుముల సుష్మా కేశవరెడ్డి తో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే టిడిపి ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. అనంతరం 31,32,33,34 వార్డుల నందు  ఇంటింటికి తిరిగి, కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు అందించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. నవంబర్ 1 తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి పార్టీల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని  ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి, చైర్పర్సన్ అభ్యర్థి సుష్మా కేశవరెడ్డిలు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ.., రెండేళ్లన్నరేళ్ళ పాలనలో రూ.260 కోట్లతో మాచర్ల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్ల విజ్ఞతతో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అలానే పట్టణంలో అమృత్ స్కీమ్, సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణాలు, పట్టణ బైపాస్ పనులు వంటివి శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో నియోజకవర్గంలో ఫ్యాక్షను తరిమి కొడుతున్నామని, అరాచకాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలు మాచర్లలో జరుగుతున్న మార్పును గమనిస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ధారునాయక్, మంజుల రెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, రాజబోయిన మధు,మధార్ సాహెబ్, గుండాల శ్రీను, కేశవరెడ్డి, రామాంజిరెడ్డి, అక్కిరెడ్డి, కొమెర దుర్గారావు,మోసిన్, అన్వర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

 

తవిటి శ్రీకాంత్. సీనియర్ రిపోర్టర్ మాచర్ల.