BREAKING
మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక

మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు

Select Suryaa Now
మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు

మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణంలోని 30, 31, 32, 33, 34వ వార్డుల్లో గురువారం కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యనుమల సుష్మ కేశవరెడ్డితో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఫారూఖ్, దాసరి వినోద్ మాట్లాడుతూ మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు రికార్డు స్థాయి విజయం నమోదు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కూటమి నాయకులు చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని వారు పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.మాచర్ల పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్తూ తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వార్డుల్లో కూటమి నాయకుల పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.