BREAKING
కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్ 2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు విశ్వక్ సేన్ కల్ట్ సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్, వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న మాస్ కా దాస్ తుఫాను ప్రభావం వలన పాఠశాలలు పరిశీలన

108 కలసల పడిపూజ

Select Suryaa Now
108 కలసల పడిపూజ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆత్రేయపురంలోని మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 28న జరగాల్సిన 108 కలసల మహాపడి పూజ  తుఫాన్ కారణంగా వాయిదా పడింది. ఈ మహోత్సవాన్ని నేడు  శుక్రవారం  అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గురుస్వామి ముదునూరి  నాగరాజు (చిన్ని) తెలిపారు.తన ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహోత్సవంలో భాగంగా రాజేష్ గురుస్వామి, మధు నంబూద్రి గురుస్వాముల నేతృత్వంలో శబరిమలలో అనుసరించే తాంత్రిక విధానాన్ని అనుసరించి మహాపడి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆత్రేయపురం మండలంతో పాటు ఇతర జిల్లాల  నుంచి సుమారు మూడు వేల మంది అయ్యప్ప స్వాములు హాజరు కానున్నారని, వారికి సాయంత్రం వడి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మహోత్సవంలో భాగంగా శ్రీ విజయ దుర్గ అయ్యప్ప గానామృతం, సంగీత స్వరసని కార్యక్రమాలతో పాటు పలు భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు జాతీయ అవార్డు గ్రహీతలు, సువర్ణ సింహతలాట సన్మానితుల సమక్షంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మధు నంబూద్రి గురుస్వామి, సల్లా కొండ బాబు గురుస్వామి తదితరులు పాల్గొననున్నారు .ఈ మహా కలశ పూజా మహోత్సవానికి గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు గురుస్వాములు, స్వాములు, భక్తులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు