BREAKING
జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

కౌసర్ ను గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ విస్తృత ప్రచారం.. 32వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన

Select Suryaa Now
కౌసర్ ను గెలిపించాలని  జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ విస్తృత ప్రచారం..    32వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:- అనంతపురం నగర పాలక సంస్థ  పరిధిలోని 32వ డివిజన్   కూటమి ( జనసేన) అభ్యర్థి కౌసర్ ను  అఖండ మెజారిటీతో గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ టీసీ వరుణ్ కోరారు. గురువారం ఆయన కూటమి అభ్యర్థి కౌసర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అర్షద్ తో కలిసి  డివిజన్ లో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డివిజన్ ప్రజలకు సుపరిచితురాలు, సమస్యల పట్ల అవగాహన వాటి పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కలిగిన కౌసర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు, కార్పొరేటర్ అభ్యర్థి కౌసర్  గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వరుణ్  విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు  కాయగూరల లక్ష్మీపతి, ఇమామ్ హుస్సేన్, అంగడి చలపతి తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాప్ రిపోర్టర్