BREAKING
జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

డబిల్‌పూర్‌లో భూ రీ సర్వే పనుల పరిశీలన.. అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచనలు

Select Suryaa Now
డబిల్‌పూర్‌లో భూ రీ సర్వే పనుల పరిశీలన.. అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచనలు
మేడ్చల్, మేజర్ న్యూస్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియలో భాగంగా గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్ గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పర్యటించి సర్వే పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భూముల వివరాల నమోదు, సర్వే నిర్వహణ తీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ భూపాల్ భూ రీ సర్వే ప్రక్రియకు సంబంధించిన వివరాలను అదనపు కలెక్టర్‌కు వివరించారు. రైతుల పాస్‌బుక్‌లో నమోదైన భూ ఆధార్ నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో భూమి లొకేషన్‌ను గుర్తించి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సర్వే జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సర్వే బృందానికి అవసరమైన సూచనలు అందించారు.భూ రీ సర్వే ద్వారా భూముల స్థానం, విస్తీర్ణం, సరిహద్దులు, రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డిజిటల్ రికార్డులతో అనుసంధానం చేయడం కీలకమని పేర్కొన్నారు. భూముల వివరాల్లో వ్యత్యాసాలను గుర్తించడం, భూ రికార్డులను మరింత పారదర్శకంగా నిర్వహించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం, రికార్డుల సవరణ వంటి అంశాలు సంబంధిత నిబంధనలు, అధికారుల పరిశీలన ఆధారంగా చేపట్టనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏడీ ఎస్ఎల్ఆర్ శ్రీనివాసులు, ఆర్ఐ కుమార్, సర్వే బృందం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.