ఆర్నాబ్ తుఫానుతో అంధకారమైన జీవీఎంసి 106 వ వార్డు జాజులవానిపాలెం
జీవీఎంసీ 106వ వార్డ్ జాజులవానిపాలెంలో కరెంటు కష్టాలతో గురువారం రాత్రి రోడ్డెక్కిన మహిళలు
స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జాజులవానిపాలెంలో కానరాని విద్యుత్ సిబ్బంది .జాజులవాని పాలెం లో మెయిన్ రోడ్ ఇటు పరవాడ వరకు అటు స్టీల్ ప్లాంట్ వరకు ట్రాఫిక్ అంతరాయం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న మహిళలకు సర్ది చెప్పి రోడ్డుపై నుండి వారిని పంపి ట్రాఫిక్ క్లియర్ చేయిస్తున్నారు. తుఫాన్ పేరుతో పరవాడ మండలం అప్రకటిత విద్యుత్ కోత విధిస్తుండడంతో వినియోగదారులు విద్యుత్ అధికారులు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.