BREAKING
ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన తెదేపా శ్రేణులు. తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు. గంట వ్యవధిలోనే స్పందన.. మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత 1వ వార్డులో తెదేపా ప్రచార హోరు.. కాకాని పావని కి అడుగడుగునా బ్రహ్మరథం. అమరవీరుల స్ఫూర్తితో.. 350 యూనిట్ల రక్తదానం. - యువతను అభినందించిన డీసీపీ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య - కేసు నమోదు బంపర్ మెజారిటీ దిశగా వైసిపి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి అడుగులు తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడు మృతి చెందిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అప్రమత్తత అవసరం దౌలాపూర్ శివారులో వ్యక్తి మృతి.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే విషాదం దౌలాపూర్ రైతుల పరిహార పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: రవీందర్ రెడ్డి పెద్ద రంగాపురంలో వైసిపి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి 14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత

అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి.

Select Suryaa Now
అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి.

అభివృద్ధిని చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి.

మాచర్ల:

మాచర్ల మున్సిపాలిటి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రూ.260 కోట్లు నిధులు తీసుకొచ్చి, అభివృద్ధి చేసి చూపాం..! మున్సిపాలిటిలో జరుగుతున్న అభివృద్ధి మరింతగా ముందుకు సాగాలంటే కూటమి పార్టీల అభ్యర్ధులను భారీ మేజారిటితో గెలిపించాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం మున్సిపాలిటి పరిధిలో 1 , 8 వ వార్డుల నందు ఎమ్మెల్యే జూలకంటి, 2 , 3వ వార్డుల నందు టీడీపీ యువ నాయకులు గౌతమ్ జూలకంటి, 35, 36 వ వార్డుల నందు మహిళా నాయకురాలు శోభారాణి లు త్రిముఖ వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోయారు. ప్రతి ఇంటికీ వెళ్లి.., కూటమి ప్రభుత్వం చేసిన మంచిని, పంచిన సంక్షేమాన్ని వివరిస్తూ.., కౌన్సిలర్ అభ్యర్ధులను, చైర్మన్ అభ్యర్ధి యెనుముల సుష్మా కేశవరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అప్యాయంగా పలకరిస్తూ.., ప్రతి వీధిలో జరిగిన అభివృద్ధిని చూపుతూ కూటమి పార్టీల శ్రేణులను కలుపుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యాగంటి మల్లికార్జునరావు, యెనుముల కేశవరెడ్డి, గడ్డ మల్లికార్జునరావు, గట్ల కోటిరెడ్డి, దుర్గారావు, శాంతి నాయుడు, వజ్రం నాయక్, బీజేపీ నాయకులు సురేష్, సీతాంజి తదితరులు పాల్గొన్నారు.

 

తవిటి శ్రీకాంత్. సీనియర్ రిపోర్టర్ మాచర్ల.