సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవు
డిఎంహెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి
ఆమనగల్లు రంగారెడ్డి:
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డి ఎం హెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి ఆదేశించారు. గురువారం ఆమనగల్లు ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వివిధ విభాగాలను, రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను వైద్యులనుఅడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. వైద్యులు నాగరాజు, అక్రమ, డిపిఓ లు ఊర్మిల, తిరుపతిరెడ్డి, సిబ్బంది వేణు, చంద్రశేఖర్ రెడ్డి, రాణి, శ్రీను, దేవేందర్ పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.