ఆనం ఆశీస్సులతో పోటీ - ఆనం సహకారంతో అభివృద్ధి - జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అభివృద్ధికి మారుపేరుగా అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో మండల జడ్పిటిసి తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నానని తనను అందరూ ఆదరించి ఆశీర్వదించి విజయం చేకూరిస్తే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఆత్మకూరు మండల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో అంకితభావంతో చిత్తశుద్ధితో కృషి చేస్తానని మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం మండలం లోని పలు గ్రామాల్లో ఆయా ప్రాంతాల తెలుగుదేశం నాయకులు, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులు తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను అందరు గుర్తించాలని, నియోజకవర్గంలో అనూహ్యంగా అభివృద్ధి పరుస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులు సాధిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సేవలను అందరు గుర్తించాలని, ఎన్నికల్లో తమకు విజయం చేకూరిస్తే రానున్న రోజుల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఆత్మకూరు మండలం మరింత అభివృద్ధి చెందేలాకృషి చేస్తానని,ప్రజలు ఆదరించాలని డాక్టర్ శశిధర్ రెడ్డి కోరారు.గతంలో తాను ఎంపీటీసీ మెంబర్గా బట్టేపాడు ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఎన్నికయ్యానని, ప్రజలకు సేవలు అందించానని, ప్రస్తుతం ఆనం ఆశీస్సులతో జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అందరూ ఆదరించి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో విజయం చేకూర్చాలని, ఆత్మకూరు మండలాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల తెలుగుదేశం, కూటమి నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయనకు గ్రామాల్లో విశేషాధరణ లభిస్తుంది. ముమ్మరంగా ప్రచారంలో ఆయన దూసుకెళ్తున్నారు.