BREAKING
జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి: బీఆర్‌ఎస్ యువ నాయకుడు గునిగరి అంజిలయ్య

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి: బీఆర్‌ఎస్ యువ నాయకుడు గునిగరి అంజిలయ్య
దోమ, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని మోత్కూర్ బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు గునిగరి అంజిలయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసిన అర్హులు, మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న అంజిలయ్య, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదులో నిర్లక్ష్యం చేయకుండా ఇతర అర్హులైన పట్టభద్రులకు సైతం అవగాహన కల్పించాలని కోరారు.పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని అంజిలయ్య పట్టభద్రులను కోరారు.