BREAKING
జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలి.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలి..   ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలో నవంబర్ 1న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల కోసం నియమించబడిన ఉద్యోగులకు నవంబర్ 2వ తేదీన ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఎన్నికల సామగ్రి స్వీకరణ, పోలింగ్ నిర్వహణ, పోలింగ్ అనంతరం ఎన్నికల సామగ్రి అప్పగింత వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల కారణంగా ఉద్యోగులు ఎక్కువ సమయం విధుల్లో ఉండటంతో పాటు, దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ప్రయాణపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమని, ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని నల్లపల్లి విజయ్ భాస్కర్ తెలిపారు. ఎన్నికల విధులను అంకితభావంతో నిర్వహించే ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పక్షాన నల్లపల్లి విజయ్ భాస్కర్ కోరారు. దీనివల్ల ఉద్యోగులకు అవసరమైన విశ్రాంతి లభించడంతో పాటు, వారు ఎదుర్కొనే ప్రయాణ, విధి నిర్వహణ సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..