గర్జించిన మహిళా లోకం - టీడీపీకి బ్రహ్మరథం..నారీ భేరి ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళా మణులు...
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ–ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నారీ భేరి – స్త్రీ శక్తి’ పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి వందలాదిగా తరలివచ్చిన మహిళామణులతో ర్యాలీ రహదారులు సందడిగా మారింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు మద్దతుగా మహిళా నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఆత్మకూరు పట్టణ అభివృద్ధి, మహిళా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో వందలాదిగా పాల్గొన్న మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మంటి ఆనం రామనారాయణ రెడ్డి బలపరచిన అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టిన మగువలు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, ఆమె తనయుడు యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి,కౌన్సిలర్ అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు తాళ్లూరు గిరినాయుడు, తుమ్మల చంద్రా రెడ్డి, ఆనం కైవల్యా రెడ్డి, పులిమి శైలజా రెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.