నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య
సర్పంచులకు సీసి కెమెరాలపై అవగాహన
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
(కిరణ్ కుమార్ ఆరిక )
కేసులను చేదించడం, నేర పరిశోధనకు సీసీ టివి కెమెరాలు కీలకమని సత్తుపల్లి రూరల్ సీఐ సరవయ్య అన్నారు. విఎం బంజర్ పోలీస్ స్టేషన్లో గురువారం సర్పంచుల సమావేశం నిర్వహించి సీసీటీవీ కెమెరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు టీవీ కెమెరాల ప్రాముఖ్యతను సర్పంచ్లకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని రహదారులు, కోడళ్ళు, గ్రామ ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలు, నేరాలు జరిగే ప్రాంతాలలో టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్ ప్రజల భద్రత మరింత బలోపేతం చేయవచ్చుననివివరించారు. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం, పోలీసు శాఖతో సమన్వయం ఎంతో ముఖ్యమని అన్నారు. గ్రామంలో నిర్దేశిత ప్రాంతాలలో కమ్యూనిటీ సిసి టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సర్పంచులు చొరవ తీసుకోవాలని కోరారు. నేరాల నివారణకు ప్రజల భద్రతకు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సీఐ సరవయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విఎం బంజర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ షాకీర్, పోలీసు సిబ్బంది, మండలంలోని గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.