BREAKING
ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: చివరి ఎనిమిది నిమిషాల్లో అద్భుతం చేసిన భారత్, హ్యాట్రిక్ విజయం సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’

శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం

Select Suryaa Now
శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం
దోమ, మేజర్ న్యూస్: దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కెపల్లి శ్రీ సంజీవ స్వామి దేవాలయ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తనకే అప్పగించాలని కోరుతూ సిద్ధాంతి పార్థసారథి ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంపై దొంగ ఎన్కెపల్లి మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, పరిగికి చెందిన హనుమాన్ భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను తిరిగి ఆయనకు అప్పగించవద్దని వారు డిమాండ్ చేశారు.గతంలో ధర్మకర్తగా పనిచేసిన సమయంలో ఆలయానికి ఆశించిన ఆదాయం రాలేదని, 20 ఏళ్లుగా ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి గ్రామస్తులను మోసం చేశారని అశోక్ రెడ్డి ఆరోపించారు. పరిగిలోని సర్వే నంబర్ 383లో ఉన్న ఆలయ మాన్యం భూమి ఇతరుల పేర్లపైకి మారడానికి అప్పటి నిర్లక్ష్యమే కారణమని, ఆలయం శిథిలావస్థకు చేరిందని ఆయన విమర్శించారు.2019లో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారిని (ఈవో) నియమించిన తర్వాత మాన్యం భూముల వేలం ద్వారా వచ్చిన రూ.20 లక్షలకు పైగా నిధులు ఆలయ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను మళ్లీ పార్థసారథికి అప్పగిస్తే శ్రీ సంజీవ స్వామి దేవాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని అశోక్ రెడ్డి, హనుమాన్ భక్తులు హెచ్చరించారు.పార్థసారథి దాఖలు చేసిన పిటిషన్‌పై దేవాదాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఆలయ భూములను పరిరక్షించేందుకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.