BREAKING
ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: చివరి ఎనిమిది నిమిషాల్లో అద్భుతం చేసిన భారత్, హ్యాట్రిక్ విజయం సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’

మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి.

Select Suryaa Now
మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి.

మాచర్ల మున్సిపాలిటి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రూ.260 కోట్లు నిధులు తీసుకొచ్చి, అభివృద్ధి చేసి చూపాం..! మున్సిపాలిటిలో జరుగుతున్న అభివృద్ధి మరింతగా ముందుకు సాగాలంటే కూటమి పార్టీల అభ్యర్ధులను భారీ మేజారిటితో గెలిపించాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం మున్సిపాలిటి పరిధిలో 1 , 8 వ వార్డుల నందు ఎమ్మెల్యే జూలకంటి, 2 , 3వ వార్డుల నందు టీడీపీ యువ నాయకులు గౌతమ్ జూలకంటి, 35, 36 వ వార్డుల నందు మహిళా నాయకురాలు శోభారాణి లు త్రిముఖ వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోయారు. ప్రతి ఇంటికీ వెళ్లి.., కూటమి ప్రభుత్వం చేసిన మంచిని, పంచిన సంక్షేమాన్ని వివరిస్తూ.., కౌన్సిలర్ అభ్యర్ధులను, చైర్మన్ అభ్యర్ధి యెనుముల సుష్మా కేశవరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అప్యాయంగా పలకరిస్తూ.., ప్రతి వీధిలో జరిగిన అభివృద్ధిని చూపుతూ కూటమి పార్టీల శ్రేణులను కలుపుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యాగంటి మల్లికార్జునరావు, యెనుముల కేశవరెడ్డి, గడ్డ మల్లికార్జునరావు, గట్ల కోటిరెడ్డి, దుర్గారావు, శాంతి నాయుడు, వజ్రం నాయక్, బీజేపీ నాయకులు సురేష్, సీతాంజి తదితరులు పాల్గొన్నారు.

తవిటి శ్రీకాంత్. సీనియర్ రిపోర్టర్ మాచర్ల.