BREAKING
తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక 108 కలసల పడిపూజ జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని.

Select Suryaa Now
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని.

**కళ్యాణదుర్గం:** సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, కౌన్సిలర్ అభ్యర్థులు శైలజ, వెంకటలక్ష్మిలకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. గతంలో అమ్మఒడి పథకం ద్వారా కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సాయం అందించేవారని, ప్రస్తుతం తల్లికి వందనం పథకం ద్వారా అర్హతల ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా ఆర్థిక సహాయం అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పాఠశాలలకు విద్యార్థుల హాజరు పెంచడం, చదువుపై ఆసక్తిని పెంపొందించడం, వారి భవిష్యత్తుకు పునాది వేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో జగనన్న గోరుముద్ద పేరుతో అమలు చేసిన పథకంలో నాణ్యతపై అనేక సమస్యలు ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మెరుగైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పేద కుటుంబాల పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడటం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఓటర్లను కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని తెలిపారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.