telangana
అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది
మేడ్చల్, మేజర్ న్యూస్: కొంపల్లికి చెందిన పస్పుల సునీతకు పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ పైలట్ అశోక్, ఈఎంటీ చిమ్మని నరేష్ గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గుర్తించిన ఈఎంటీ నరేష్, ఈఆర్‌సీపీ వైద్యురాలు డాక్టర్ స్మిత సూచనల మేరకు అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. దీంతో సునీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అనంతరం తల్లీబిడ్డను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. అత్యవసర సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి సకాలంలో వైద్యసాయం అందించిన 108 సిబ్బంది పైలట్ అశోక్, ఈఎంటీ నరేష్‌ను కుటుంబ సభ్యులు అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.